KNR: సైదాపూర్ మండలం వెన్కేపల్లిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొంత సుధాకర్, సైదాపూర్ ప్యాక్స్ పీఐసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 2,400 మద్దతు ధర కల్పిస్తుందన్నారు. 14 శాతం తేమ మించకుండా రైతులు మొక్కజొన్నను తీసుకురావాలని సూచించారు.