SKLM: కొత్తవంతెనపై నుంచి నాగావళి నదిలో ఆదివారం రాత్రి దూకిన డి .రాజేశ్వరి (42) మృతదేహం బుధవారం గళ్లవానిపేట గ్రామం వద్ద తీరంలో లభ్యమైంది. ఆమె భర్త మోహనరావు గుర్తించారు. స్థానిక మత్య్సకారుల సమాచారం మేరకు రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించి, పోస్టు మార్టం నిమిత్తం సర్వజనాసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.