సత్యసాయి: ఓడిచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి ఆటల పోటీలు ముగిశాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కబడ్డీ, కోకో, వాలీబాల్, చెస్, యోగ వంటి క్రీడల్లో టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల నుంచి 118 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను డివిజనల్ స్థాయి టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు.