GDWL: రాష్ట్ర విద్యుత్ శాఖ పిలుపు మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు గురువారం ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను, చెత్తా చెదారాన్ని తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ శివకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.