ATP: గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామానికి చెందిన శిరీష అనే వివాహిత గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబసభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యయత్నానికి కారణాలు తెలియాల్సింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.