NLG: మొంథా తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని గూడూరు గ్రామంలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు.