MDK: సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినమైన జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు మెదక్ పట్టణంలోని బోధన్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు రన్నింగ్ కార్యక్రమం జరుగుతుందన్నారు.