బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ అవార్డులు కొనుక్కొంటారని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. దానికి స్పందిస్తూ అభిషేక్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ‘ఇప్పటివరకూ నేనెప్పుడూ ఒక్క అవార్డు కూడా కొనుక్కోలేదు. నా కోసం ఏ PRలు పని చేయడం లేదు. భవిష్యత్తులో నేను ఏది సాధించినా అనుమానాలకు తావు లేకుండా కష్టపడి పనిచేస్తా. నా విషయంలో మీది తప్పని నిరూపిస్తా’ అని చెప్పారు.