VZM: తెర్లాం మండలంలోని అరసబలగ సమీపంలో తోటపల్లి పిల్ల కాలువ బురదలో ఎద్దు కూరుకుపోయింది. కాలువలో ఎద్దు కూరుకుపోవడంతో బయటకు తీసేందుకు రైతు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. పంట నష్టాన్ని పరిశీలిస్తున్న కూటమి నాయకులు, ప్రజల సహకారంతో ఎద్దును బయటకు తీశారు. దీంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.