ASR: తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన బంగారమ్మ పాలెం గ్రామంలో హోం మంత్రి వంగలపూడి అనిత రేపు ఉదయం 9:30 గంటలకు పర్యటించనున్నట్లు పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. గ్రామస్తులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకుంటారని అన్నారు. అనంతరం నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.