AP: యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది గాయపడ్డారు. వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి వెళ్తుండగా జౌన్పుర్లో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. బాధితులను ఫోన్లో పరామర్శించారు. బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.