2026లో జరగనున్న CBSE పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు ఫైనల్ డేట్ షీట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని CBSE స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 9 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కంట్రోలర్ (ఎగ్జామ్స్) భరద్వాజ్ వెల్లడించారు. రోజూ ఈ పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు.