BDK: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నవీన్ యాదవ్ గెలుపును కాంక్షిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి గురువారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఓటును అభ్యర్థించారు. వారితోపాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఉన్నారు.