ELR: పోలవరం తహశీల్దార్ కార్యాలయ సమీపంలో రైతు కూలీ సంఘం నాయకులు గురువారం ఆందోళన చేశారు. నాయకులు మాట్లాడుతూ.. మొంథా తుఫాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న మినుము, వరి, పత్తి, కూరగాయ, ఉద్యానవన పంటలకు సమగ్ర సర్వే జరిపించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.