NLG: చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి, నేరడ, వట్టిమర్తి, పెద్దకాపర్తి గ్రామాల్లో పత్తి, వరి పొలాలను ఎంఏవో గిరిబాబు గురువారం పరిశీలించారు. మండలంలో 240 ఎకరాల్లో వరి, 120 ఎకరాల్లో పత్తి వర్షాల వల్ల దెబ్బతిన్నట్లుగా అంచనాకు రావడం జరిగిందని తెలిపారు. దెబ్బతిన్న పంటలకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆయనతో ఏఈవోలు ఉన్నారు.