NRPT: కలెక్టర్ సిక్తా పట్నాయక్ మద్దూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ వివరాలను అడిగి తెలుసుకుని, వైద్యుల పనితీరును సమీక్షించారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి వార్డులు సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.