ASR: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గురువారం డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతాన్ని సందర్శించారు. ఇక్కడ రహదారి కోసం అడవితల్లికి బాట పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుమారు రూ.1కోటి 85లక్షలు మంజూరు చేశారన్నారు. ఇక్కడ రోడ్డు నిర్మించారు కానీ కాలువపై వంతెన నిర్మించలేదన్నారు. ఇది సరికాదన్నారు. ప్రభుత్వం వంతెన నిర్మించాలని కోరారు.