SKLM: గార మండంలం శ్రీకూర్మం పంచాయతీ సెగిడిపేటలోని పలు వీధి రోడ్డులు దారుణంగా దర్శనమిస్తున్నాయి. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వాడుకనీరు వీధిలోని రోడ్లపై పారుతూ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో స్థానిక గ్రామ ప్రజలు రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాలువ నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు.