NRML: నిర్మల్‌లోని గండి రామన్న సాయిబాబా ఆలయం నుండి గురువారం 15 మంది భక్తులు షిరిడీకి పాదయాత్రగా బయలుదేరారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. గత 11 ఏళ్లుగా దత్త జయంతి సందర్భంగా ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. సాయి దీక్ష సేవాసమితి సభ్యులు మనోహర్, గోవర్ధన్, నందు, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.