బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మైనార్టీలపై విషం కక్కుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నాయన్నారు. మైనార్టీకి మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేయడం బీఆర్ఎస్ లాభం కోసమేనని ఎంపీ చామల ఆరోపించారు.