TPT: గూడూరు SKR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ డాక్టర్ వై. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఏటా అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకొంటారని చెప్పారు. అనంతరం భారతదేశ ఐక్యత, సమగ్రత, జాతీయ సంఘీభావాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ సూచిస్తుందని తెలిపారు.