KNR: 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను సైనిక్ స్కూల్ 6వ, 9వ తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారు. నవంబర్ 9వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సైనిక్ స్కూల్ అర్హత పరీక్ష జనవరి 18న నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. కరీంనగర్‌లోని రుక్మాపూర్‌లో సైనిక్ స్కూల్ ఉన్న విషయం తెలిసిందే.