KMR: పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నానన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీర్కూర్ మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ అన్నారు. బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పోచారం వర్గీయులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.