NZB: ప్రభుత్వ కళాశాలకు వెళ్లాలంటే ఆ బురదలో నుంచి నడవాల్సిందే. భీంగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలకు బురదలో నుంచి నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలో అన్ని ప్రభుత్వ కళాశాలలు ఒకే దగ్గర నిర్మించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాల, కొత్తగా ప్రభుత్వ ఆధీనంలో టాటా కంపెనీ వారు ఏటీసీ కాలేజ్ భవనం కూడా అక్కడనే నిర్మించారు. అధికారులు స్పందించాలని కోరారు.