GNTR: తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల తాడేపల్లి పరిధి అంజిరెడ్డి కాలనీ, మహానాడు రోడ్డులో నష్టపోయిన అరటి పంటలను మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గురువారం పరిశీలించారు. అధికారులు వెంటనే పంట నష్టంపై అంచనాలు వేసి పరిహారం అందించాలన్నారు. గత ఏడాది ఇలానే విపత్తు వస్తే ఆ పరిహారం ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదనీ ఆయన మండిపడ్డారు.