W.G: మొంథా తుఫాన్ పరిస్థితులు, సహాయక చర్యలపై వైసీపీ అధినేత జగన్ గురువారం జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్లు, అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్లో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రస్తుత నష్టం నివేదికను, తాజా పరిస్థితులను ఆయన జగన్కు వివరించినట్లు తెలిపారు.