TPT: రేపు నాయుడుపేటలో 2కె రన్ నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి బి మునిరత్నం తెలిపారు. ఇందులో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాలను పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా, ఉదయం 6 గంటలకు స్థానిక అమరావతి హోటల్ కూడలి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యర్థులు పాల్గొన్నారు.