SKLM: సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామానికి చెందిన బీసీ, ఎస్సీ కాలనీ రోడ్లు జలమయం అయ్యాయని స్థానికులు గురువారం తెలిపారు. ఆర్ అండ్ బీ రోడ్డు పక్కనగల ప్రధాన కాలువలో పూడిక తీత పనులు చేపట్టకపోవడంతో ఈ నీరు నిలిచిపోయిందని వాపోయారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కాలువలో పూడిక తీత పనులు చేపట్టి దోమలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.