విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి తీవ్రంగా పెరుగుతోంది. బ్యారేజీ ఇన్ ఫ్లో (నీటి ప్రవాహం) 5 లక్షల క్యూసెక్కులు దాటింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అధికారులు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.