ASR: మొంథా తుఫాను ప్రభావంతో అరకు వ్యవసాయ శాఖ డివిజన్ పరిదిలో 66 హెక్టార్ల వరి పంట నీట మునిగిందని ఏడీఏ మోహనరావు తెలిపారు. అత్యధికంగా హుకుంపేట మండలంలో 28.328 హెక్టర్లు, అరకులోయలో 19.5 హెక్టర్లు, అనంతగిరిలో 11.33 హెక్టర్లు, డుంబ్రిగుడలో 6.87 హెక్టర్లు నీట మునిగినట్లు ఏడీఏ పేర్కొన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించినట్లు ఆయన తెలిపారు.