BDK: కరకగూడెం పోలీస్ స్టేషన్లో గురువారం డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ రికార్డులు, విధులు నిర్వహణ విధానం, స్టేషన్ పరిసరాలు పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, ప్రజల పట్ల మర్యాద, కేసుల విచారణలో వేగం వంటి అంశాలపై సూచనలు చేశారు. ఈ తనిఖీలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగేశ్వరరావు పాల్గొన్నారు.