MBNR: రాజాపూర్ మండల పోలీస్ ఆధ్వర్యంలో రేపు భారత్ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ శివానందం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి కుచ్చెర్కల్ గ్రామం వరకు ఏక్తా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరుకావాలని ఆయన కోరారు.