PPM: మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పార్వతీపురం మండలం నర్సిపురంలో గురువారం పెంకుటిల్లు గోడ కూలిపోయింది. ఈ మేరకు నర్సిపురం గ్రామం పెద్ద వీధికి చెందిన వైకుంఠపు త్రినాధ దంపతులు నివసిస్తున్న పెంకుటిల్లు వర్గాలకు పూర్తిగా తడిసిపోవడం వలన నానిపోయి అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.