MBNR: చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి జాతరలో న్యాయ సేవల ప్రదర్శన స్టాల్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిరా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలను అందించడం, హక్కులను గురించి అవగాహన కల్పించడం ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. స్టాల్లో లోక్ అదాలత్ సమాచారం అందుబాటులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు.