MDK: కొల్చారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఉపాధి హామీ గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో 2026- 27 సంవత్సరంలో గ్రామంలో ఉపాధి హామీ పని ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో చర్చించారు. గ్రామంలో ప్రతి కూలికి పని కల్పించడమే ఉపాధి హామీ లక్ష్యమని పేర్కొన్నారు.