ASR: డుంబ్రిగూడ మండలంలోని కించుమండ–కితలంగి ప్రాంతంలో తుఫాన్ ప్రభావంతో వంతెనపై నీరు ప్రవహిస్తున్న పరిస్థితిని రాష్ట్ర జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫాన్‌పై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని, అధికారుల కృషి ప్రశంసనీయమని కొనియాడారు.