అల్లూరి: మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గురువారం పాడేరు ఘాట్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలుచోట్ల రోడ్డు బాగా దెబ్బతింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కరించాలని పోలీసు, అటవీశాఖ అధికారులను ఆదేశించారు. వాహనాలు నిలిపివేయాలని సూచించారు.