BDK: ఇల్లందు నియోజకవర్గం గార్ల మండల పాకాల ఏరును గురువారం తహసీల్దార్, ఎంపీడీవో పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పాకాల ఏరు పొంగి పొర్లుతోందని, సత్నాపురం నుండి బయ్యారం వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలని సూచించారు. ప్రజలు చేపల వేటకు వెళ్ళొద్దని అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దని తెలిపారు.