BHNG: భువనగిరి మండలంలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టాలని GMPS జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన వడపర్తిలో మేడబోయిన బాలయ్య గొర్రెల దొంగతనం జరుగగా, దొంగతనం జరిగిన ప్రదేశాన్ని GMPS ఆధ్వర్యంలో పరిశీలించి మాట్లాడారు. జరిగిన సంఘటనపై స్పెషల్ టీం ఏర్పాటు చేసి బాలయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.