సత్యసాయి: అన్ని రంగాల్లో ఆర్యవైశ్యుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సవిత తెలిపారు. తాడేపల్లిలో మంత్రి సవితను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఆది నుంచి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.