MDK: తూప్రాన్ మండలంలో కొనసాగుతున్న పంటల నమోదును జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ పరిశీలించారు. మండలంలోని నాగులపల్లి పంచాయతీ పరిధి జండాపల్లి వద్ద వ్యవసాయ విస్తారణ అధికారులు నమోదు చేసిన పంటల వివరాలను జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ పరిశీలించారు. ఎరువులు, పురుగుల మందు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందులో ఏవో గంగమల్లు, రైతులు పాల్గొన్నారు.