SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వరద తాకిడికి గురైన ప్రాంతాన్ని ఇవాళ కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరుపతమ్మ స్థానిక ఎమ్మార్వో కలిసి పరిశీలించారు. వరద నీరు వెళ్లేందుకు చెరువు రెండు తూములను తెరవాలని ఎమ్మార్వో అధికారులను ఆదేశించారు. ఇళ్లు నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఛైర్ పర్సన్ కోరారు.