టీమిండియాతో జరుగుతున్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఫోబ్ లిచ్ఫీల్డ్ (83*), ఎల్లీస్ పెర్రీ (37*) వేగంగా ఆడుతూ 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఈ జోడీని త్వరగా విడదీయకపోతే, ఆసీస్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.