AKP: ఎలమంచిలి మండలం రామానాయుడు పాలెం గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు గురువారం దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారికి అడ్డంగా వరద నీరు ప్రవహిస్తుంది. దీని మీదగా 15 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులు కల్వర్టుకు మరమ్మతులు చేపట్టి రాకపోకులను పునరుద్ధరించాలని 24వ వార్డు టీడీపీ అధ్యక్షుడు గొర్లె బాబురావు అధికారులకు విజ్ఞప్తి చేశారు.