NRML: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 1200.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా బాసర మండలంలో 110.4, ముధోల్ 104.4, సోన్ 81.4, పెంబి 81.6, ఖానాపూర్ 101.2, కడెం 73.2. మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు. రాబోయే 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వారు పేర్కొన్నారు.