ప్రకాశం: మద్దిపాడు మండలం గుండ్లపల్లిలోని తుఫాన్ పునరావాస కేంద్రాన్ని సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర 20 సూత్రాల ఛైర్మన్ లంకా దినకర్ పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పునరావాస కేంద్రంలో ఉన్నా రాచవారిపాలెం గ్రామ ప్రజలను పలకరించారు. మధ్యాహ్నం భోజనం అందించి ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను సూచించారు. ప్రజలను ఆదుకుంటామన్నారు.