NRML: మధ్యాహ్నం భోజనం కార్మికులకు పెండింగ్ వేతనాలు, బిల్లులు చెల్లించాలని సీఐటీయు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. గురువారం దస్తురాబాద్ మండలంలోని ముణ్యాల జడ్పీ పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం కార్మికులకు రూ పదివేల కనీస వేతనం చెల్లించాలన్నారు.