ATP: రబీ సీజన్ ప్రారంభమైనా రైతులకు సబ్సిడీ పప్పుశనగ విత్తనాలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. పుట్లూరు తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక రైతులతో కలిసి ఆయన గురువారం అధికారులకు వినతిపత్రం అందజేశారు. అదును దాటిన తర్వాత విత్తనాలు ఇస్తే ఉపయోగం ఉండదని తెలిపారు.