కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్ ఎంపికయ్యాడు. ఈ మేరకు KKR ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. 2025 IPLలో ఘోర ప్రదర్శన అనంతరం హెడ్ కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిత్‌ను KKR తప్పించింది. అతడి స్థానంలో అభిషేక్‌కు అవకాశం కల్పించింది. కాగా, గతంలో అభిషేక్.. టీమిండియాకు అసిస్టెంట్ కోచ్‌గా, KKRకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు.