AP: మొంథా తుఫాన్ సమస్యలు సృష్టించిందని సీఎం చంద్రబాబు అన్నారు. మొంథా తుఫాన్ దాగుడుమూతలు ఆడిందన్నారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణపై మొంథా ఎఫెక్ట్ చూపిందని తెలిపారు. అధికారులంతా చాలా సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. మొంథా తుఫాన్‌ను ముందుగానే అంచనా వేయడం వల్ల భారీ నష్టం తప్పిందని వెల్లడించారు.